దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు గురువారం లాభాలతో ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్ 327 పాయింట్ల లాభంతో 65,553 దగ్గర ట్రేడవుతోంది. నిఫ్టీ 90 పాయింట్లు లాభపడి 19,526 వద్ద కొనసాగుతోంది. డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ రూ. 83.20 గా ఉంది. నెస్లే ఇండియా, పవర్‌గ్రిడ్, భారతీ ఎయిర్టెల్, యాక్సిస్ బ్యాంక్ షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి.