ఆసియా క్రీడల్లో భారత్‌కు మరో స్వర్ణం లభించింది. మహిళల ఆర్చరీలో జ్యోతి సురేఖ వెన్నమ్, అదితి గోపిచంద్, పర్ణీత్ కౌర్‌తో కూడిన జట్టు ఫైనల్లో చైనీస్ తైపీపై 230-280 పాయింట్ల తేడాతో విజయం సాధించి బంగారు పతకం గెలుచుకుంది. దీంతో భారత్ ఖాతాలో 82 పతకాలు చేరాయి. కాగా, ఆర్చరీలో భారత్‌కు ఇది రెండో బంగారు పతకం.