ఇంటర్ విద్యార్థులకు ఏపీ ప్రభుత్వం గుడ్‌న్యూస్ చెప్పింది. ఇంటర్ పరీక్షల్లో ఫెయిలైన వారు, డిస్ కంటిన్యూ స్టూడెంట్స్ పరీక్ష ఫీజు చెల్లించడానికి గడువును నవంబర్ 30వ తేదీ వరకు పొడిగించింది. ఈ మేరకు విద్యా శాఖ అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. వీరికి కంపార్ట్‌మెంట్ ప్రస్తావన లేకుండా రెగ్యులర్ సర్టిఫికెట్లు జారీ చేస్తామని పేర్కొన్నారు. 2023, 2024 పరీక్షల్లో వచ్చిన మార్కుల్లో ఏవి ఎక్కువ ఉంటే వాటినే తీసుకుంటామని వివరించారు.