ఆసియా క్రీడల్లో భారత్ నూతన అధ్యాయనం లిఖించింది. మునుపెన్నడూ లేనివిధంగా ఈసారి శత పతకాలు సాధించింది. ఇవాళ మహిళల కబడ్డీ ఫైనల్లో చైనీస్ జట్టును చిత్తు చేస్తూ భారత్ స్వర్ణంతో మెరిసింది. అలాగే ఆర్చరీ ఈవెంట్లో శనివారం మొత్తం 4 పతకాలను భారత్ కైవసం చేసుకుంది. దీంతో ఇప్పటివరకు భారత్ గెలుచుకున్న పతకాల సంఖ్య 100కి చేరింది. ఇందులో స్వర్ణం- 25 రజతం- 35 కాంస్యం- 40 పతకాలు ఉన్నాయి.