వన్డే వరల్డ్ కప్లో భాగంగా ఆదివారం ఆస్ట్రేలియాతో భారత్ తొలి మ్యాచ్ ఆడనుంది. ఈ మ్యాచ్కు ఇద్దరు ఆటగాళ్లు అందుబాటులో ఉండటంపై అనుమానాలు ఉన్నాయి. టీమ్ఇండియా ఓపెనర్ శుభ్మన్ గిల్ డెంగీ బారిన పడ్డాడు. మరోవైపు నెట్ ప్రాక్టీస్ చేస్తున్న సమయంలో ఆల్రౌండర్ హార్దిక్ పాండ్య వేలికి గాయమైనట్లు సమాచారం. దీనిపై బీసీసీఐ అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేదు.