చైనాలో ప్రస్తుతం జరుగుతున్న ఆసియా క్రీడలు-2023లో భారత్‌కు మరో స్వర్ణ పతకం లభించింది. బ్యాడ్మింటన్ పురుషుల డబుల్స్ ఈవెంట్లో భారత్‌కు చెందిన సాత్విక్-చిరాగ్ శెట్టిలు చరిత్ర సృష్టించారు. శనివారం జరిగిన ఫైనల్లో రిపబ్లిక్ ఆఫ్ కొరియాకు చెందిన చోయ్ సోల్గ్యు-కిమ్ వోన్హోలను 21-18, 21-16 తేడాతో వరుస గేమ్‌లలో ఓడించి స్వర్ణ పతకాన్ని కైవసం చేసుకున్నారు. ఈ విజయంతో నాటికి భారత్ పతకాల సంఖ్య 101కి చేరుకుంది.