దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు బుధవారం లాభాలతో ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్ 257.25 పాయింట్లు పెరిగి 66,336 వద్ద ట్రేడ్ అవుతోంది. నిఫ్టీ 79.80 పాయింట్ల లాభంతో 19,769.60 వద్ద ట్రేడ్ అవుతోంది. ఉదయం సెషన్లో హెచ్డీఎఫ్సీ బ్యాంక్, TCS, ఎల్ అండ్ టీ, ఎస్బీఐ, మహీంద్రా అండ్ మహీంద్రా టాప్ గెయినర్లుగా ఉన్నాయి. TCS, డెల్టా కార్ప్ తదితర కంపెనీలు ఈ ఆర్థిక సంవత్సరంలో రెండవ త్రైమాసిక ఆదాయాలను ప్రకటించనున్నాయి.