అక్టోబర్ 14 న, ప్రపంచంలోనే అతి పెద్ద అహమ్మదాబాద్ నరేంద్ర మోడీ స్టేడియం వేదికగా భారత్, పాకిస్థాన్ పోటీపడనున్నాయి. ఈ రసవత్తరమైన మ్యాచ్ కి తమిళ్ స్టార్ ఐన సూపర్ స్టార్ రజినీకాంత్ మరియు బాలీవుడ్ నటుడు అమితాబ్ బచ్చన్ మ్యాచ్ వీక్షించడానికి రానున్నారు. ఈ మ్యాచ్ కి ముందు బీసీసీఐ బృందం ఒక ప్రత్యేక ఈవెంట్ ఉంటుందని వెల్లడించారు. ఈ మ్యాచ్ లో ఎటువంటి సమస్యలు రాకుండా 11,000 మందితో భద్రత బలగాలను ఏర్పాటు చేస్తారని సమాచారం.