టీమిండియా బ్యాటర్ శుభ్‌మన్ గిల్ డెంగీ బారిన పడటంతో వన్డే ప్రపంచకప్‌లో రెండు మ్యాచ్‌లకు దూరమయ్యాడు. శనివారం అహ్మదాబాద్ వేదికగా పాకిస్థాన్‌తో జరగనున్న మ్యాచ్‌లో ఆడతాడని ఆశిస్తున్న వేళ.. భారత బ్యాటింగ్ కోచ్ విక్రమ్ రాథోడ్ కీలక అప్డేట్ ఇచ్చాడు. ‘‘గిల్ వేగంగా కోలుకుంటున్నాడు. త్వరలోనే మైదానంలోకి వస్తాడని ఆశిస్తున్నాం. అయితే, ఏ మ్యాచ్‌లో ఆడతాడనేది ఇప్పుడే చెప్పడం కష్టం’’ అని తెలిపాడు.