దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు గురువారం స్వల్ప లాభాలతో ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్ 55 పాయింట్ల లాభంతో 66,528 దగ్గర ట్రేడవుతోంది. నిఫ్టీ 16 పాయింట్లు లాభపడి 19,828 దగ్గర కొనసాగుతోంది. డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ రూ. 83.15 దగ్గర ప్రారంభమైంది. SBI, టాటా మోటార్స్, యాక్సిస్ బ్యాంక్, ICICI బ్యాంక్, టాటా స్టీల్, మారుతీ, NTPC షేర్లు లాభాల్లో ఉన్నాయి.