రోజూ ఒక గుడ్డు తినడం వల్ల ఆరోగ్యంగా ఉండవచ్చని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. గుడ్డు తినడం వల్ల డాక్టర్ అవసరం రాదని కేంబ్రిడ్జి యూనివర్సిటీ ప్రొఫెసర్లు తెలిపారు. గుడ్డులో ప్రోటీన్లు, విటమిన్లు ఏ, బీ, బీ12, డీ, లుటిన్లు పుష్కలంగా ఉంటాయి. ఉడికిన గుడ్డును ఫ్రై చేసుకొని తినరాదని, అలాగే 28 రోజులు దాటిన గుడ్డను తినకూడదని చెబుతున్నారు. కేవలం ఉడకబెట్టిన గుడ్డును మాత్రమే తినాలన్నారు.