శరీరంలో చెడు కొలెస్ట్రాల్ స్థాయి పెరిగితే.. గుండె సంబంధిత సమస్యలు వస్తాయని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. దీన్ని తగ్గించేందుకు రోజు వ్యాయామాలతో పాటు ఆహారంలో మార్పులు అవసరం అని సూచిస్తున్నారు. బీన్స్, శనగలు, మోనో అన్‌శాచురేటెడ్ కొవ్వులు గల నట్స్, పాలకూర తీసుకోవాలి. రోజూ ఒక యాపిల్ తింటే మంచిది. వెల్లుల్లి, ఓట్స్, బార్లీ, రెడ్ రైస్ వంటివి చెడు కొలెస్ట్రాల్ స్థాయిని తగ్గిస్తాయని అంటున్నారు.