మన శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచడంలో ప్లేట్‌లెట్లు కీలక పాత్ర పోషిస్తాయి. శరీరంలో ఇవి లేకపోతే చనిపోతారు కూడా. అయితే డెంగ్యూ, మలేరియా బారిన పడ్డవారిలో ప్లేట్‌లెట్ కౌంట్ చాలా తగ్గుతుంది. వారికోసం నిపుణులు కొన్ని ఆహారాలను సూచిస్తున్నారు. బొప్పాయి, బీట్‌రూట్, పాలకూర, దానిమ్మ, వెల్లుల్లి, గుమ్మడికాయతో పాటు గుడ్లు, కొవ్వు తక్కువ ఉంటే మాంసానికి ప్రాధాన్యం ఇవ్వాలన్నారు.