ఈరోజు భారత్-పాక్ వరల్డ్ కప్ మ్యాచ్ కోసం సచిన్ టెండూల్కర్, దినేశ్ కార్తీక్, అనుష్క శర్మ ఒకే విమానంలో అహ్మదాబాద్ కు చేరుకున్నారు. ఈక్రమంలో దిగిన ఫొటోను దినేశ్ తన ఇన్స్టాలో పంచుకున్నారు. 'రాయల్టీ ఎట్ 35,000 ఫీట్' అంటూ దానికి కాప్షన్ ఇచ్చారు. వీరితో పాటు ఈ ప్రతిష్ఠాత్మక మ్యాచ్ ను ప్రత్యక్షంగా తిలకించేందుకు ఇప్పటికే అమితాబ్, రజనీ వంటివారికి బీసీసీఐ గోల్డెన్ టికెట్లను ఇచ్చింది.