సోయాబీన్ ఆయిల్ గుండెకు ఎంతో మేలుచేస్తుంది. ఇందులో ఉన్న పాలీ అన్ శాట్యురేటెడ్ ఫ్యాట్స్ గుండె ఆరోగ్యానికి ఉపకరిస్తాయని నిపుణులు సూచిస్తున్నారు. ఇందులో ఉండే ఆరోగ్యకర కొవ్వులు హృద్రోగ ముప్పును నివారిస్తాయని కొన్ని అధ్యయనాలు వెల్లడించాయి. సోయాబీన్ ఆయిల్ కొలెస్ట్రాల్ లెవెల్స్ ను తగ్గించి కరోనరీ హార్ట్ డిసీజ్ ముప్పును తగ్గిస్తుందని నేషనల్ ఇనిస్టిట్యూట్స్ ఆఫ్ హెల్త్ (NIH) వెల్లడించింది.