గంటల పాటు కదలకుండా కూర్చుంటే డీప్ వెయిన్ థ్రోంబోసిస్ వ్యాధి వచ్చే అవకాశం ఉందంట. ఎక్కువసేపు కూర్చుని ప్రయాణించే వారిలో ఈ వ్యాధి వచ్చే అవకాశాలు ఎక్కువ అని నిపుణులు చెబుతున్నారు. 4 గంటల కన్నా ఎక్కువ కూర్చుంటే బ్లడ్ క్లాట్స్ ఏర్పడే అవకాశం ఉందట. దీంతో పల్మనరీ ఎంబాలిజమ్ (ఊపిరితిత్తులకు రక్తస్రావం ఆగిపోవడం) వచ్చే అవకాశం ఉంది. కాళ్లు కదిలించడం, స్ట్రైచ్ చేయడం చేస్తే బ్లడ్ క్లాట్ రిస్క్ నుంచి బయటపడొచ్చంటున్నారు.