భారత్-పాక్ మధ్య జరిగిన మ్యాచ్‌లో హార్దిక్ పాండ్యాకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. ఇందులో హార్దిక్ పాండ్యా బంతితో ఏదో మాట్లాడుతాడు. ఆ తర్వాత వేసిన బౌలింగ్‌లో పాక్ బ్యాటర్ ఇమామ్ ఉల్ హక్ ఔట్ అవుతాడు. హార్దిక్ బౌల్‌తో ఏం మాట్లాడారని నెట్టింట చర్చ మొదలైంది. దీనిపై పాండ్యా స్పందిస్తూ.. ‘నాతో నేను మాట్లాడుకున్నా.. బంతిని సరైన ప్రాంతంలో వేసేలా నన్ను నేను ప్రేరేపించుకున్నా’ అని చెప్పారు.