దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు ఇవాళ నష్టాలతో ప్రారంభమయ్యాయి. ఉదయం 9:20 గంటలకు సెన్సెక్స్ 453.05 పాయింట్ల భారీ నష్టంతో 65,423.46 పాయింట్ల వద్ద కొనసాగుతోంది. ఇక నిఫ్టీ 126.65 పాయింట్ల నష్టంతో 19,544.45 వద్ద ట్రేడవుతోంది. ఇవాళ్టి టాప్ గెయినర్స్ జాబితాలో ప్రధానంగా సిప్లా, డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్, టాటా మోటార్స్, సన్ ఫార్మా, ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీలు ఉన్నాయి.