టీమ్ ఇండియా మాజీ క్రికెటర్ అజారుద్దీన్‌పై నాన్ బెయిలబుల్ కేసు నమోదైంది. ఉప్పల్ స్టేడియంలో వివిధ సామగ్రి కొనుగోళ్లలో కోట్ల రూపాయల గోల్మాల్ జరిగిందని ఆరోపిస్తూ.. హెచ్‌సీఏ సీఈఓ సునిల్ చేసిన ఫిర్యాదుతో ఉప్పల్ పోలీసులు పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. అగ్నిమాపక పరికరాలు, క్రికెట్ బంతులు, జిమ్ సామగ్రితో సహా అనేక పరికరాల కొనుగోలు వ్యవహారంలో అవకతవకలు జరిగాయని సీఈఓ సునిల్ ఫిర్యాదులో పేర్కొన్నారు.