అపర కుబేరుడు ఎలాన్ మస్క్ అంటే తెలియని వారు ఉండరు. ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడిగా కొనసాగుతున్నారు. అయితే, ఎలాన్ మస్క్ కు ఊహించని షాక్ తగిలింది. ఒక్కరోజే ఏకంగా 13 లక్షల కోట్ల సంపదను కోల్పోయారు. అందుకు ప్రధాన కారణం టెస్లా కంపెనీ. ఈ ఆర్థిక ఏడాది మూడో త్రైమాసిక ఫలితాలను టెస్లా కంపెనీ గురువారం విడుదల చేయగా ఆ ప్రభావం షేర్లపై పడింది. షేర్ల అమ్మకాల ఒత్తిడితో ఎలాన్ మస్క్ భారీగా నష్టపోయారు.