టీమిండియా ఆల్‌రౌండర్ హార్ధిక్ పాండ్యా చీలమండ గాయం నుండి ఇంకా కోలుకోలేదు. బంగ్లాదేశ్‌పై మ్యాచ్‌లో బౌలింగ్ చేస్తుండగా అతనికి గాయమైన విషయం తెలిసిందే. ఈమేరకు హార్ధిక్ ప్రస్తుతం బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీలో చికిత్స పొందుతున్నారు. అయితే ఇంకా ప్రాక్టీస్ మొదలుపెట్టని పాండ్యా నాకౌట్ దశకు పూర్తి ఫిట్నెస్ సాధించేందుకు తగిన సమయం ఇవ్వాలని మేనేజ్మెంట్ భావిస్తోందని సమాచారం.