టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ గాయపడ్డాడు. దీంతో క్రికెట్ అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇవాళ టీమిండియా ఇంగ్లండ్తో మ్యాచ్ ఆడనుంది. దీనికోసం నిన్న ప్రాక్టీస్ చేస్తుండగా రోహిత్ మణికట్టుకు గాయమైంది. బ్యాటింగ్ చేస్తుండగా బాల్ తగలడంతో వెంటనే ఫిజియో వచ్చి టెస్టులు చేశారు. అయితే గాయం తీవ్రతపై స్పష్టత రాలేదు. ఒకవేళ రోహిత్ శర్మ నేటి మ్యాచుకు దూరమైతే కేఎల్ రాహుల్ కెప్టెన్సీ చేయనున్నాడు.