నాగార్జునసాగర్ లోని బుద్దవనంలో ఆదివారం బుద్ధధాతువులు ప్రతిష్ఠాపనోత్సవం జరుగనుందని బుద్ధవనం ప్రత్యేకాధికారి మల్లేపల్లి లక్ష్మయ్య తెలిపారు. బుద్ధుడు, అతని ఎనిమిది మంది శిష్యుల పవిత్రమైన ధాతువులకు 2009లో ఇండోనే షియాలో బుద్ధిపూజ మహోత్సవం నిర్వహించారని పేర్కొన్నారు. గగన్ మాలిక్ ఫౌండేషన్ వ్యవస్థాపకుడు గగన్ మాలిక్ ఈ దాతులను బుధవారం లోని మహస్తుపంలో 25 మంది బౌద్ధుల ఆధ్వర్యంలో శాశ్వతంగా నిక్షిప్తం చేస్తున్నామని తెలిపారు.