ఐసీసీ వన్డే వరల్డ్‌కప్ చరిత్రలో భారత్ అరుదైన రికార్డు సాధించింది. వన్డే ప్రపంచకప్‌లలో అత్యధిక విజయాలు సాధించిన రెండో జట్టుగా టీమిండియా నిలిచింది. ఆదివారం లక్నోలో ఇంగ్లండ్‌ను ఓడించిన భారత్ ఈ రికార్డు తన ఖాతాలో వేసుకుంది. 58 విజయాలతో భారత్, న్యూజిలాండ్ సంయుక్తంగా రెండో స్థానంలో ఉండగా ఈ విజయంతో న్యూజిలాండ్‌ను అధిగమించింది. ఇక అత్యధిక విజయాలు సాధించిన జట్టుగా ఆస్ట్రేలియా (73) అగ్రస్థానంలో కొనసాగుతోంది.