వన్డే ప్రపంచకప్లో భాగంగా గురువారం శ్రీలంకతో తలపడేందుకు భారత్ సన్నద్ధమవుతోంది. వాంఖడే వేదికగా ఈ మ్యాచ్ జరగనుంది. ఈ క్రమంలో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. క్రికెటర్గా నిలదొక్కుకోవడానికి ఇదే స్టేడియం ప్రధాన కారణమని పేర్కొన్నాడు. ఇక్కడి నుంచి ఎన్నో విషయాలను నేర్చుకున్నట్లు తెలిపాడు. ముంబయి వాసుల క్రికెట్ అభిమానం కూడా కట్టిపడేస్తుందని చెప్పాడు.