వరల్డ్ కప్ లో అక్టోబరు 19న బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో గాయం కారణంగా జట్టుకు దూరమైన ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యాపై కెప్టెన్ రోహిత్‌శర్మ అప్డేట్ ఇచ్చాడు. నేడు జరిగే శ్రీలంకతో మ్యాచ్‌లో పాండ్య ఆడడం లేదని కెప్టెన్ రోహిత్ శర్మ తెలిపారు. మ్యాచ్ కు ముందు నిర్వహించిన విలేకరుల సమావేశంలో రోహిత్ మాట్లాడారు. గాయం నుంచి పాండ్యా వేగంగా కోలుకుంటున్నాడని, త్వరలోనే అతడిని చూస్తామని చెప్పుకొచ్చాడు.