భారత స్టార్ స్విమ్మర్ విర్ధావల్ ఖడే రిటైర్మెంట్ ప్రకటించి అందరినీ ఆశ్చర్యానికి గురి చేశాడు. గోవాలో జరుగుతున్న 37వ నేషనల్ గేమ్స్‌లో బంగారు పతకం గెలుచిన విర్దావల్.. స్విమ్మింగ్‌కి గుడ్ బై చెప్పాడు. 2001లో మొదటి నేషనల్ మెడల్ సాధించానని, ఇప్పుడు బంగారు పతకం గెలవడంతో నా జీవితం పరిపూర్ణం అయిందన్నారు. నా శరీరం అలసిపోయిందని, అందుకే రిటైర్మెంట్ ప్రకటిస్తున్నట్లు పేర్కొన్నాడు.