దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు శుక్రవారం లాభాలతో ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్ 378 పాయింట్ల లాభంతో 64,459 దగ్గర ట్రేడవుతోంది. నిఫ్టీ 112 పాయింట్లు లాభపడి 19,245 దగ్గర కొనసాగుతోంది. డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ 83.23 దగ్గర ప్రారంభమైంది. టాటా మోటార్స్, ఇన్ఫోసిస్, టెక్ మహీంద్రా షేర్లు లాభాల్లో ఉన్నాయి. ఎన్టీపీసీ, టాటా స్టీల్, నెస్లే ఇండియా షేర్లు నష్టాల్లో ఉన్నాయి.