కొద్దిగా జీలకర్రను తీసుకుని పొడి చేసి దాన్ని ఓ కప్పు పెరుగులో కలుపుకుని తింటే త్వరగా బరువు తగ్గుతారని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. అలాగే పెరుగులో చక్కెర కలుపుకుని తింటే..శరీరానికి వెంటనే శక్తి అందుతుంది. వాము, పెరుగులో కలిపి తింటే నోటి పూత, దంతాల నొప్పి, ఇతర దంత సంబంధ సమస్యలు పోతాయి. అలాగే పెరుగులో ఓట్స్ కలిపి తింటే మంచి ప్రోబయోటిక్స్, ప్రోటీన్లు లభిస్తాయని సూచిస్తున్నారు.