దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు బుధవారం ఫ్లాట్గా ప్రారంభమయ్యాయి. ఉదయం 9:23 గంటల సమయానికి సెన్సెక్స్ 43 పాయింట్లు క్షీణించి 64,898 పాయింట్ల దగ్గర ట్రేడ్ అవుతోంది. నిఫ్టీ 2 పాయింట్లు స్వల్పంగా క్షీణించి 19,404 వద్ద కొనసాగుతోంది. డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ 83.26గా ఉంది. నిఫ్టీలో BPCL, అదానీ పోర్ట్స్, ఏషియన్ పెయింట్స్, UPL, సిప్లా షేర్లు లాభపడగా, HDFC బ్యాంక్, ICICI బ్యాంక్ షేర్లు నష్టపోయాయి.