పెరుగు ఆరోగ్యానికి ఎంతో మంచిది. ఇందులో లాక్టిక్ యాసిడ్, కాల్షియం, మెగ్నిషియం, పొటాషియం, విటమిన్ బీ పుష్కలంగా ఉంటాయి. పెరుగు ఆరోగ్యానికి మంచిదైనప్పటికీ.. కొన్ని ఆహార పదార్థాలతో దీన్ని కలిపి తినకూడదు. మాంసం, చేపలతో పెరుగును కలిపి తినకూడదు. అలాగే ఉల్లిపాయలతో పెరుగు కలిపి తినకూడదు. ఉల్లిపాయ, పెరుగు కలిపి తినడం వల్ల అలర్జీలు, ఎగ్జిమా, సోరియాసిస్ వచ్చే ప్రమాదముంది.