దేశీయ స్టాక్ మార్కెటలకు మంగళవారం సెలవు. దీపావళి బలిప్రాతిపద కారణంగా బీఎస్ఈ, ఎన్ఎస్ఈలు మంగళవారం మూతపడి ఉంటాయి. ఈక్విటీ, ఈక్విటీ డెరివేటివ్, ఎస్ఎల్బీ సెగ్మెంట్ల కార్యకలాపాలు నేడు నిలిచిపోనున్నాయి. కరెన్సీ డెరివేటివ్ మార్కెట్ కూడా పనిచేయదు. మంగళవారం సెలవు తర్వాత దేశీయ సూచీలు తిరిగి బుధవారం యథాతథంగా పనిచేస్తాయి. అన్ని సెగ్మెంట్స్‌లో కార్యకలాపాలు సాధారణంగా జరుగుతాయి.