దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు గురువారం నష్టాలతో ప్రారంభమయ్యాయి. ఉదయం 9:24 గంటల సమయంలో సెన్సెక్స్ 115 పాయింట్ల నష్టంతో 65,560 దగ్గర ట్రేడవుతోంది. నిఫ్టీ 34 పాయింట్లు నష్టపోయి 19,640 దగ్గర కొనసాగుతోంది. డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ 83.18 దగ్గర ప్రారంభమైంది. టీసీఎస్, ఎంఅండ్‌ఎం, ఎన్‌టీపీసీ షేర్లు లాభాల్లో ఉన్నాయి. బజాజ్ ఫైనాన్స్, బజాజ్ ఫిన్‌సర్వ్, పవర్‌గ్రిడ్, టైటన్ షేర్లు నష్టాల్లో ఉన్నాయి.