ఇజ్రాయెల్-హమాస్ యుద్ధం నేపథ్యంలో ట్విట్టర్(X) అధినేత ఎలాన్ మస్క్ కీలక విషయాన్ని ప్రకటించారు. యుద్ధంలో అతలాకుతలమైన ఇజ్రాయెల్- గాజాలోని ఆసుపత్రులకు భారీ సాయాన్ని ప్రకటించారు. ఇజ్రాయెల్-హమాస్ యుద్ధానికి సంబంధించిన ప్రకటనలు, చందాల నుంచి వచ్చే మొత్తం ఆదాయాన్ని అక్కడి ఆసుపత్రులకు విరాళంగా ఇవ్వనున్నట్టు వెల్లడించారు. మస్క్ నిర్ణయాన్ని నెటిజన్లు అభినందిస్తున్నారు.