దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు బుధవారం లాభాల్లో ప్రారంభమయ్యాయి. ఉదయం సెన్సెక్స్ 226.89 పాయింట్ల లాభంతో 66,401.09 వద్ద, నిఫ్టీ 73.35 పాయింట్ల లాభంతో 19,963.05 వద్ద ట్రేడ్ అవుతున్నాయి. సెన్సెక్స్‌లో ఇండస్ఇండ్ బ్యాంక్, భారతీ ఎయిర్టెల్, HCL టెక్, NTPC షేర్లు ఎక్కువ లాభపడగా, ఏషియన్ పెయింట్స్, సన్ ఫార్మా, హిందుస్తాన్ యూనిలీవర్ నష్టాలలో ఉన్నాయి. US డాలర్‌తో పోలిస్తే రూపాయి విలువ 83.31 వద్ద ఉంది.