లోన్ యాప్స్, ఆన్‌లైన్ ప్లాట్‌ఫారమ్‌లను నిషేధించేలా కఠినమైన చట్టాన్ని తీసుకురావడానికి కేంద్రంలోని మోడీ ప్రభుత్వం సన్నద్ధమవుతోంది. ఇలాంటి అనేక నియంత్రణ లేని ఆన్‌లైన్ లోన్ యాప్‌లను ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం నిషేధించింది.
ఇప్పుడు థర్డ్ పార్టీ సర్వీస్ ప్రొవైడర్లను కూడా నియంత్రించేందుకు ఆర్‌బీఐకి అనుమతి ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం పరిశీలిస్తోంది. ఈ RBI నియమాలు NBFCలు, HFC లు అవుట్‌సోర్స్ ఎంపికలకు వర్తిస్తాయి.