దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు బుధవారం లాభాలతో ప్రారంభం అయ్యాయి. ఉదయం 9.15 నాటికి సెన్సెక్స్ 308.99 పాయింట్ల లాభంతో 69,605.13 వద్ద, నిఫ్టీ 94.20 పాయింట్ల లాభంతో 20,949.30 వద్ద ట్రేడ్ అవుతున్నాయి. సెన్సెక్స్‌లో ఏషియన్ పెయింట్స్, పవర్‌గ్రిడ్, యాక్సిస్ బ్యాంక్, సన్ ఫార్మా ఎక్కువ లాభపడ్డాయి. మారుతీ, JSW స్టీల్, అల్ట్రాటెక్ సిమెంట్, ఇన్ఫోసిస్ నష్టాలలో ఉన్నాయి. డాలర్‌తో పోలిస్తే రూపాయి విలువ 83.35గా ఉంది.