దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు గురువారం నష్టాలతో మొదలయ్యాయి. ఉదయం 9:28 గంటల సమయంలో సెన్సెక్స్ 319 పాయింట్లు నష్టపోయి 69,333 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 84 పాయింట్లు కుంగి 20,853 దగ్గర కొనసాగుతోంది. డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ రూ.83.36 వద్ద ప్రారంభమైంది. అల్ట్రాటెక్ సిమెంట్స్, పవర్గ్రిడ్షేర్లు లాభాల్లో ఉన్నాయి. హెచ్యూఎల్, భారతీ ఎయిర్టెల్, ఐసీఐసీఐ, ఎంఅండ్ఎం షేర్లు నష్టాల్లో ఉన్నాయి.