క్రికెట్ బ్యాట్లను సాధారణంగా ‘విల్లో’ అనే కలపతో తయారు చేస్తారు. ప్రొఫెషనల్ క్రికెట్లో ఉపయోగించే బ్యాట్లు ఒకే కలపతో ఉంటాయి. వీటిలో కశ్మీరీ విల్లో, ఇంగ్లిష్ విల్లో అనే రకాలు ఉంటాయి. కాశ్మీరీ విల్లో బ్యాట్ల కంటే ఇంగ్లిష్ విల్లోతో తయారైన బ్యాట్లు చాలా బలంగా, అధిక నాణ్యతతో కూడి ఉంటాయి. క్రికెట్ బ్యాట్లను తయారు చేయడానికి ఉపయోగించే విల్లో ముఖ్యంగా ఐరోపా విస్తృతంగా, ఆసియాలో కొన్ని ప్రాంతాల్లో లభ్యమవుతుంది.