దేశీయ స్టాక్ మార్కెట్లు ఇవాళ లాభాలతో ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్ 850కు పైగా పాయింట్ల లాభంతో 70,470, నిఫ్టీ 264 పాయింట్లు పెరిగి 21,173 వద్ద ట్రేడవుతున్నాయి. అదానీ పోర్ట్స్, హిందాల్కో, టెక్ మహీంద్రా, అదానీ ఎంటర్ ప్రైజెస్, NTPC, విప్రో, యాక్సిస్ బ్యాంక్ షేర్లు లాభాలతో ఉండగా, పవర్ గ్రిడ్, టాటా కన్జూమర్, నెస్లే, ఏషియన్ పెయింట్స్, సిప్లా, టైటాన్, బజాజ్ ఆటో, SBI లైఫ్, సన్ ఫార్మా, హిందుస్థాన్ యూనీలివర్, BPCL నష్టాల్లో ఉన్నాయి.