రాగి జావను ఉదయం అల్పాహారంగా తీసుకుంటే ఎంతో మేలు జరుగుతుంది. రోజంతా ఎంతో ఉత్సాహంగా ఉంటారు. ముఖ్యంగా ఎదిగే పిల్లలకు ప్రతి రోజూ రాగి జావ తాగించడం వల్ల మెదడు చురుగ్గా మారుతుంది. వేడి శరీరంతో బాధపడే వారికి రాగి జావ దివ్యౌషధంగా ఉపయోగపడుతుందని నిపుణులు చెబుతున్నారు. రాగిజావలోని ప్రోటీన్లు శారీరక దృఢత్వానికి కూడా దోహదపడతాయి. ప్రతీరోజూ రాగిజావను డైట్లో భాగం చేసుకుంటే కాళ్లు, చేతులు దృఢంగా మారుతాయి.