భారత స్టాక్ మార్కెట్ సూచీలు బుధవారం భారీ లాభాల్లో ప్రారంభమయ్యాయి. సరికొత్త గరిష్ట స్థాయికి చేరుకున్నాయి. ఉదయం 9.15 గంటలకు సెన్సెక్స్ 351.89 పాయింట్లు పెరిగి 71,789.08 వద్ద, నిఫ్టీ 105.40 పాయింట్లు పెరిగి 21,558.50 వద్ద ట్రేడ్ అవుతున్నాయి.
నిఫ్టీలో విప్రో, ఇన్ఫోసిస్, NTPC, నెస్లే లాభాల్లో ఉండగా, మారుతి సుజుకి మాత్రమే నష్టపోయింది. డాలర్‌తో పోలిస్తే రూపాయి విలువ 83.18 వద్ద ఫ్లాట్‌గా ప్రారంభమైంది.