రేగుపండ్లతో అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. వీటిలో లభించే A,C విటమిన్లు, పొటాషియం శరీరంలో రోగనిరోధక శక్తిని, రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయిలను పెంచుతాయి. రక్తహీనత సమస్యను దూరం చేయడంతో పాటు ఎముకలను దృఢంగా ఉంచుతాయి. రేగుపండ్లు చర్మాన్ని మృదువుగా ఉంచుతాయి. కీళ్ల వాపులు, నొప్పులు ఉన్నవారు సైతం ఈ పండ్లు తింటే మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.