దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు 2023 చివరి ట్రేడింగ్ సెషన్‌ను నష్టాలతో ప్రారంభించాయి. అంతర్జాతీయ మార్కెట్లలో మిశ్రమ సంకేతాలు సూచీలపై ప్రభావం చూపుతున్నాయి. ఉదయం 9:26 గంటలకు సెన్సెక్స్ 178 పాయింట్లు నష్టపోయి 72,231 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 57 పాయింట్లు పతనమై 21,721 వద్ద ముగిసింది. డాలర్‌తో రూపాయి మారకం విలువ రూ.83.15 వద్ద ప్రారంభమైంది.
సెన్సెక్స్-30 ఇండెక్స్‌లో టాటా మోటార్స్, నెస్లే ఇండియా, మారుతీ, ఐటీసీ, ఎల్ అండ్ టీ, ఏషియన్ పెయింట్స్, సన్‌ఫార్మా లాభాల్లో కొనసాగుతున్నాయి. కోటక్ మహీంద్రా బ్యాంక్, రిలయన్స్, టైటాన్, ఇన్ఫోసిస్, పవర్‌గ్రిడ్, ఎస్‌బిఐ, బజాజ్ ఫైనాన్స్, ఎం అండ్ ఎం, టాటా స్టీల్, యాక్సిస్ బ్యాంక్ షేర్లు నష్టాల్లో ట్రేడ్ అవుతున్నాయి. గురువారం అమెరికా మార్కెట్లు ఫ్లాట్‌గా ముగిశాయి.