ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఎక్కువ సేపు కూర్చోవడం కూడా డేంజరా..?

Life style |  Suryaa Desk  | Published : Sat, Dec 30, 2023, 11:45 AM

ఎక్కువ సేపు కూర్చోవడం వల్ల శరీరక సమస్యలే కాదు మానసిక సమస్యలు కూడా వస్తాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఎక్కువ సేపు కూర్చొని పనిచేయడం వల్ల వెన్నునొప్పితో పాటు మొత్తం ఆరోగ్యం దెబ్బతింటుంది. అంతేకాకుండా అధిక బరువు, టైప్-2 డయాబెటిస్, గుండె సమస్యలు, డిప్రెషన్, యాంగ్జైటీ వంటి సమస్యలకు దారితీస్తుంది.
మీ కండరాలు కదులుతున్నప్పుడు.. లిపోప్రొటీన్ లిఫేజ్ లాంటి అణువులను విడుదల చేస్తుంది. ఇది మీరు తినే కొవ్వులు, చక్కెరలను ప్రాసెస్ చేయడానికి సహాయపడుతుంది. అయితే ఎక్కువ సేపు ఒకే చోట కూర్చోవడం వల్ల ఈ అణువుల విడుదల తగ్గుతుంది. అధ్యయనాల ప్రకారం.. మీరు ఒకేచోట ఎక్కువ సేపు కూర్చోవడం వల్ల మెటబాలిక్ సిండ్రోమ్ వచ్చే ప్రమాదం ఉంది. అందుకే ఎక్కువగా కూర్చునే వారు ఒక గంటపాటైనా వ్యాయామం చేయాలని డాక్టర్లు సిఫార్సు చేస్తున్నారు. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com