హడావుడిగా స్నానం చేయడం ఏమాత్రం సరైంది కాదని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు. స్నానాలన్నింటిలో సముద్ర స్నానం శ్రేష్టమైందని, సముద్రంలో స్నానం చేయడం వల్ల శరీరంపైన ఉన్న మలినాలు పూర్తిగా నశిస్తాయన్నారు. నదీ స్నానం, పుష్కర స్నానం ఆరోగ్యానికి మంచిది. ఇంట్లో స్నానం చేసేటప్పుడు గోరువెచ్చటి నీటితో స్నానం చేయాలి. శరీరానికి ఉన్న అలసట తీరే వరకు స్నానం చేయాలని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు.