వెల్లుల్లి శరీరంలో రక్తం గడ్డకట్టడాన్ని నివారిస్తుంది. వెల్లుల్లిని రోజూ తినడం వల్ల గుండెకు రక్త ప్రసరణ మెరుగుపడుతుంది. గుండెపోటును నివారిస్తుంది. వెల్లుల్లి తినడం వల్ల త్వరగా బరువు తగ్గే అవకాశం కూడా ఉంది. వెల్లుల్లిని తీసుకుంటే జలుబు, ఊపిరితిత్తులకు సంబంధించిన సమస్యలు తగ్గుతాయి. వెల్లుల్లిలోని యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు గొంతు సమస్యలకు చికిత్స చేయడంలో సహాయపడతాయి.