భారత్, దక్షిణాఫ్రికా మధ్య జరిగిన రెండో టెస్టు మ్యాచ్‌లో టీమిండియా ఘన విజయం అందుకుంది. అయితే ఈ మ్యాచ్ జరిగిన కేప్‌టౌన్ పిచ్‌పై ఐసీసీ అసంతృప్తి వ్యక్తం చేసింది. టెస్టు క్రికెట్ చరిత్రలోనే అత్యంత త్వరగా పూర్తయిన మ్యాచ్ ఇది. ఈ నేపథ్యంలో పిచ్ సంతృప్తికరంగా లేదంటూ ఐసీసీ రేటింగ్ ఇచ్చింది. ఓ అయోగ్యతా పాయింట్ కూడా ఇచ్చింది. ఏ పిచ్‌కైనా ఐదేళ్ల కాలంలో ఆరు అయోగ్యతా పాయింట్లు వస్తే ఆ పిచ్‌పై ఏడాది నిషేధం విధిస్తారు.