శ్రీశైలం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కర్నూలు జిల్లాలోని ప్రసిద్ధ శైవక్షేత్రము. నల్లమల అడవుల్లో కొండగుట్టల మధ్య శ్రీ మల్లికార్జునుని పవిత్ర క్షేత్రం కొలువై ఉంది.
భౌరాపూర్ చెరువు వద్ద వెలసిన భ్రమరాంబ అమ్మవారికి రెడ్డిరాజులు, విష్ణుకుండినులు, చాళుక్యుల కాలంలో గుడి నిర్మించినట్టు చరిత్ర చెప్తోంది. ఈ ఆలయంలో శివపార్వతులు భక్తులకు దర్శనం ఇస్తారు. స్వామి గుడి పక్కనే ఉన్న నాగుల కట్ట వద్ద పూజలు చేస్తే ఎలాంటి నాగదోషమైనా తొలగుతుందని నమ్మకం.