ఎంపీ కేశినేని నాని ఇవాళ మధ్యాహ్నం సీఎం జగన్‌ను కలిసే అవకాశం ఉంది. ఆయన వైసీపీలో చేరేందుకు దాదాపు ఖరారైనట్లు సమాచారం. ఇప్పటికే ఈ విషయంపై వైసీపీ నేతలు నానితో చర్చించారు.
అయితే అతనికి వైసీపీ విజయవాడ ఎంపీ టికెట్ మాత్రమే ఇచ్చే అవకాశం ఉంది. ఆ పార్లమెంట్ పరిధిలోని అసెంబ్లీ స్థానాల్లో ఆయన జోక్యం ఉండదు. కాగా, ఇటీవల ఆయనకు ఎంపీ టికెట్‌ను టీడీపీ నిరాకరించడంతో ఆ పార్టీకి రాజీనామా చేసిన విషయం తెలిసిందే.